Kitchen Tips : వీటిని వండేట‌ప్పుడు.. వీటిని క‌ల‌పండి.. మరింత రుచిగా ఉంటాయి..

ప్ర‌తి ఇంట్లో ప్ర‌తి ఉద‌యం వంట గ‌దిలో యుద్ధ‌మే చేస్తారు మ‌హిళ‌లు. పిల్ల‌లు, భ‌ర్త కోసం టిఫిన్, భోజ‌నం, స్నాక్స్ ఇలా బోలెడు ప‌ని. రెండు చేతులే అయినా నాలుగు ర‌కాలు చేయ‌టం అనేది ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ది. ఇంట్లో వండే కూర‌లు రుచిగా.. త్వ‌ర‌గా త‌యారు కావాలంటే.. ఈ క‌ర్నీలు వండే స‌మ‌యంలో.. వీటిని క‌ల‌పండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. త్వ‌ర‌గా అయిపోయింది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా...

• బెండకాయ వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే ముక్కలు అంటుకోకుండా ఉంటాయి.

• అలూ  ముక్కల్ని ఉడికించేటప్పుడు రసం పిండేసిన నిమ్మ చెక్కలను చేర్చి ఉడికిస్తే వేపుడు రుచికరంగా ఉంటుంది.

• మునగాకు వండేటప్పుడు కొంచెం చక్కెరను కలిపి ఉడికిస్తే ఆకులు ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటాయి.

• అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకు చేర్చితే టేస్టీగా ఉంటుంది.

• పుదీనా పచ్చడి చేసేటప్పుడు కాస్త పల్లీలు కలిపి చూడండి. రుచి అదిరిపోతుంది.

• చేపలు గ్రిల్ చేసేటప్పుడు గ్రిల్ ప్లేట్ పై నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది.

• ఉల్లిగడ్డలను 10 నిమిషాల పాటు నీళ్లల్లో ఉంచితే వాటిని తరిగేటప్పుడు కళ్లు మండవు. కళ్లనుంచి నీరు కారపు

• వెల్లుల్లిపాయలను 15 నిమిషాలపాటు నీళ్లల్లో వానబెడితే వాటిపైనున్న పొట్టు సులభంగా వచ్చేస్తుంది.

• డ్రైఫ్రూట్స్ ను తరిగేముందు గంటపాటు ఫ్రీజ్లో ఉంచాలి.

 

ALSO READ : Super Food : మిరియాల అన్నం.. కొర్రల పలావ్.. కాలీఫ్లవర్ రైస్.. అబ్బబ్బ ఇంట్లో టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!

• బాదం, టొమాటోపై ఉన్న పొట్టు సులువుగా రావడానికి వాటిని ఐదు నుంచి 10 నిమిషాల పాటు వేడి నీళ్లల్లో ఉంచాలి.

... వెలుగు లైఫ్