ఫ్లోర్ క్లీనింగ్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అయితే, అమ్మోనియా, బ్లీచ్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో తయారయ్యే వాటివల్ల అంతకు పదింతల సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా నేచురల్ ఇంటిని క్లీన్ చేసుకోవాలంటే ఇలా చేయాలి.
గోరు వెచ్ళనినీళ్లలో సర్చ్, బేకింగ్ సోడా వేసి బాగా ఆ నీళ్లతో మార్బుల్ ఫ్లోర్ తుడిస్తే తళతళా మెరుస్తుంది. పటిక, ఉప్పు, కర్పూరం బిళ్లల్ని ఫ్లోర్ క్లీనింగ్ కి వాడొచ్చు. ఈ మూడింటినీ నీళ్లలో పూర్తిగా కరిగించాలి. తర్వాత వాటిని కొంచెం ఫినాయిల్, డెటాల్ వేసిన నీళ్లలో కలిపి తుడవాలి. వారానికి రెండు సార్లు ఈ నేచురల్ ఫ్లోర్ క్లీనర్ వాడితే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. పటిక యాంటి బయాటిక్ లా పనిచేసి ఫ్లోర్పై ఉండే క్రిముల్ని చంపేస్తుంది. ఉప్పు మార్పుల్ని మెరిపిస్తుంది. కర్పూరం రెపెల్లంట్ గా పనిచేస్తుంది. దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు ఇంట్లోకి రావు.