Good Health : చిన్న చిన్న అనారోగ్యాలకు వంటింటి చిట్కాలే విరుగుడు.. !

విరుగుడు చిన్న చిన్న అనారోగ్యాలకు వంటింటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. జ్వరంతో బాధపడుతున్న వాళ్లకు లేత బీరపొట్టు వేపుడు అన్నంలో కలిపి పెడితే మంచిది. నెలసరి నొప్పితో బాధపడేవాళ్లు పుదీనా ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి తాగాలి. పుదీనా ఆకులు, ఉప్పు నీళ్లలో వేసి మరిగించి.. ఆవిరి పడితే గొంతులో గరగర మాయమవుతుంది. 

గొంతు కూడా మృదువుగా మారుతుంది. ఉసిరి పచ్చడి,తేనెలో నానపెట్టిన ఉసిరి రోజూ తింటే దృష్టి లోపం తగ్గుతుంది. అలాగే ఉసిరి పొడిని రోజూ పరగడుపున తేనెతో కలిపి తాగితే.. ఒత్తిడి, అలసట తగ్గుతాయి. ఎండుద్రాక్షలు, కిస్మిస్ లు తినడం వల్ల వేడి పోతుంది. రాత్రి గ్లాసెడు నీళ్లలో ఎండు ద్రాక్షలు నానపెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే చాలా మంచిది. 

ముఖ్యంగా పిల్లలకు. అరటిపండు, తేనెతో కలిపి తీసుకుంటే క్షయతో బాధపడుతున్నవాళ్లకు కొంచెం రిలీఫ్ లభిస్తుంది. నేరేడు ఆకులు నీళ్లలో మరిగించి, వడగట్టిన తర్వాత ఆ నీళ్లను పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. వేప బెరడును పెనంపై బాగా కాల్చి.. మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరినూనె కలిపి, కురుపులపై రాస్తే పోతాయి. వేపాకు రసం, దానికి ఈక్వెల్ క్వాంటిటీలో పెరుగుని కలిపి, దానికి కొంచెం నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.