KA Movie: కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ 'క' మూవీ మలయాళం రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA) టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ కలెక్షన్స్తో మంచి హిట్ కొట్టాడు కిరణ్. ఇప్పటికే ఈ మూవీ సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకుని.. అన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్కి మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

మొదట 'క' సినిమాను పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, తమిళ, మలయాళ భాషల్లో పెద్ద సినిమాలు ఉండటంతో అప్పుడు కుదర్లేదు. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం వస్తోన్న టాక్, కలెక్షన్స్ దృష్ట్యా.. ఇదే సరైన టైం అని భావించి మిగతా భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Also Read :- ఆస్కార్ 2025 'లాపతా లేడీస్' టైటిల్‌ చేంజ్

ఈ నేపథ్యంలో ఇవాళ బుధవారం (నవంబర్ 13న) 'క' సినిమా మలయాళం రిలీజ్ డేట్ను ప్రకటించారు. నవంబర్ 22న రిలీజ్ కానుంది. కాగా 'క' సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రొడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలీంస్ (Wayfarer Films) భారీ ధరకు  సొంతం చేసుకుంది. "క" సినిమా స్టార్ట్ చేసాక.. మేకర్స్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయగానే.. దుల్కర్ సల్మాన్ ఇంప్రెస్ అయి మలయాళ వెర్షన్‌ను తమ వేఫేరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

ఇక ఇప్పుడు మలయాళ మార్కెట్ లో KA సినిమాకి దుల్కర్ ఎంట్రీతో బలమైన పునాది అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో భారీ విజయం అందుకున్న కిరణ్ అబ్బవరం 'క'.. పాన్ ఇండియా వైడ్గా ఎలా థ్రిల్ చేయనుందో చూడాలి.

ఇప్పటివరకుక మూవీ ఇండియా నెట్ కలెక్షన్ చూసుకుంటే.. రూ.24.10 కోట్లకు చేరుకుంది. గ్రాస్ కలెక్షన్ రూ.28.43 కోట్లకు చేరుకుంది. త్వరలో క సినిమా రూ.30 కోట్ల టార్గెట్‌తో దూసుకుపోతోంది. చూడాలి మరి ఏ రేంజ్ వరకు చేరుతుందో!