నిజామాబాద్​లో కిడ్స్ కేర్ హాస్పిటల్ ​ప్రారంభం

నిజామాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని అతిపెద్ద కిడ్స్ కేర్ చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ను ఆదివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ ​సూర్యనారాయణ  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమేశ్​ పవార్, డాక్టర్ అనిత ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా హాస్పిటల్​యజమాని డాక్టర్ రమేశ్​పవార్ మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలతో జిల్లా ప్రజలకు చిల్డ్రన్​హాస్పిటల్​ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.