Good Health: ఇవి తింటే కిడ్నీల ఆరోగ్యం సూపర్​..!

మన శరీరంలో మీ మూత్రపిండాలు  కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని  వ్యర్థాలను తొలగించి  రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి .  ఇవి శరీరంలోని ద్రవాలను.. రసాయనాలను సమతుల్యం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి సరిగా పనిచేయకపోతే బయటకు పోవలసిన మలినాలు రక్తంలో చేరడంతో అనేక రోగాలు వస్తాయి. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్​ ను తీసుకోవాలి.   వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఐదు రకాల కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ వివరాలను తెలుసుకుందాం. . . 

కాలీఫ్లవర్ :  కిడ్నీ ఆరోగ్యాన్ని సంరక్షించటంలో కానీ, కిడ్నీ సమస్యలను నివారించటంలో కానీ కాలీఫ్లవర్ ఒక సూపర్ ఫుడ్. ఎందుకంటే ఇది శరీరం లోని టాక్సిన్స్ ను బయటకు పంపించేయటానికి సహాయపడుతుంది.  కాలీఫ్లవర్ మీ మూత్రపిండాలు అధిక రక్తపోటును నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడే వివిధ పోషకాలను అందిస్తుంది. కాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ...  ఫెర్రస్ రకాల మూలకాలు ఉన్నాయి . ఇంకా వీటిలో విటమిన్లు A, B, C, అయోడిన్, పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ప్రోటీన్లతో పాటు కొద్ది మొత్తంలో రాగి కూడా ఉంటుంది. కాలీఫ్లవర్ కిడ్నీ జబ్బులతో పాటు  మధుమేహం, గుండె జబ్బులు , ఇన్ఫెక్షన్, అధిక బరువు మరియు శరీరంలో వాపు వంటి ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  .కాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి, ఫోలేట్ ..  ఫైబర్ కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ఈ కాలీఫ్లవర్ ను కిడ్నీ సమస్యలకు ఒక న్యాచురల్ రెమెడీ గా పేర్కొంటారు.

Also Read :- జాబ్ పోయింది..లీఫ్​తో లైఫ్​ టర్న్​ అయింది!

బెండకాయ: దీనిని ఇంగ్లీషులో లేడీస్​ ఫింగర్​ అంటారు.  ఇందులో ఫైబర్​ తో యూగ్లీనా అనే మూలకం ఉంటుంది.  ఇది మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది,  ఇందులో ఉండే పాక్టిన్​ అనే పోషకం  శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. 

పొట్లకాయ:  ఇది మంచి నీటి వనరు. ఇందులో  96% నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. దీని లోపల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్, సల్ఫర్, విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి అనేక పోషకాలు అందుబాటులో ఉన్నాయి. దీని  ఔషధ గుణాల కారణంగా , పొట్లకాయ  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.  కిడ్నీ వ్యాధితో బాధ పడే వారు దీనిని తినడం వలన  ఇందులో ఉండే పాస్పరస్​ కిడ్నీ బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. 

 రెడ్ క్యాప్సికమ్ : కిడ్నీ వ్యాధికి రెడ్ క్యాప్సికమ్ మంచి ఔషధం,  ఇందులో ఉండే  లైకోపీన్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.    ఇందులో   విటమిన్ సి, మరియు విటమిన్ ఎ, అలాగే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ .. ఫైబర్  కంటెంట్​ ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులను తగ్గించడంతో పాటు   రెడ్ క్యాప్సికమ్ గుండె సమస్యలు ...  కంటిశుక్లాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పని చేస్తుంది. 

నీరు: ఇది  ఆహారం కాకపోయినా ...  కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా... అవి సరిగ్గా  పని చేయాలన్నా   సరిగ్గా నీరు త్రాగాలి.  సింపుల్ గా చెప్పాలంటే మహిళలు అయితే  రోజుకు 8 గ్లాసులు, పురుషులు అయితే  రోజుకు13 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు త్రాగకపోవటం వల్ల వచ్చే డీహైడ్రేషన్..  కిడ్నీ ఫెయిల్యూర్ కు  కారణమవుతుంది..  కిడ్నీల సమస్యలకు కారణం అయ్యే అవకాశాలున్నాయి.   కిడ్నీ ఆరోగ్యానికి నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

యాపిల్ పండ్లు :  యాపిల్ పండ్లలో కిడ్నీ కి హాని కలిగించే సోడియం, పొటాషియం,  ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి, అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా  యాపిల్ పండ్లను తినాలి.  ఇవి  కిడ్నీ లో బ్యాక్టీరియా పెరగకుండా  నియంత్రిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా యాపిల్ పండ్లలో ఉండే విటమిన్లు, ఫైబర్,  మినరల్స్  వంటి మంచి పోషకాలు శరీరానికి అందిస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కూడా యాపిల్స్ తినటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నాయి. 

కేల్ :  ఇది  ఆకుకూరలలో ఒక రకం. ఈ కేల్ కూర  తక్కువ పొటాషియం ఫుడ్ అవ్వటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నా  తినవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ,విటమిన్ సి మరియు క్యాల్షియం సహా ఇతర మినరల్స్ కిడ్నీ సరిగ్గా పని చేయటంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం మధుమేహం...  ఈ ఆకు కూర షుగర్ లెవల్ ను నియంత్రించడంలో సహాయపడి మధుమేహం పై ప్రభావం చూపుతుంది .

ముల్లంగి:  ముల్లంగి అనేది ఒక మంచి డిటాక్స్ ఫుడ్. ముల్లంగి లో తక్కువుగా  పొటాషియం ,  ఫాస్పరస్ ఉండటం వల్ల ఇది మంచి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ అవుతుంది. ముల్లంగి లో ఇండోల్ -3-కార్బినాల్ మరియు 4 -మిథైల్థియో,  -3-బ్యూటెనిల్-ఐసోథియోసైనేట్ ఉండటం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపించటానికి అలాగే కిడ్నీ సరిగ్గా పని చేయటానికి బాగా సహాయపడగలదు. పచ్చి ముల్లంగి కంటే ఉడకబెట్టిన ముల్లంగిలోనే తక్కువ పొటాషియం ఉంటుంది, అందుకని వండుకొని తింటేనే కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.