కెనడాలో హిందూ దేవాలయంపై ఖలీస్తానీ దాడి ...ప్రధాని ట్రూడో ఎమన్నారంటే.?

కెనడాలో  హిందూ దేవాలయంపై  దాడి జరిగింది.   బ్రాంప్టన్ లోని హిందూ సభ మందిర్ లో  కొందరు ఖలీస్తాన్ మద్దతుదారులు హిందూ,కెనడియన్  భక్తులను టార్గెట్ చేసుకుని దాడికి దిగారు.  టెంపుల్ దగ్గర కొందరు భక్తులపై  దాడి చేశారు.  ఖలిస్తాన్ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలు పట్టుకుని   కొంతమంది టెంపుల్ గేట్లను ధ్వంసం చేశారు. భక్తులపై దాడి చేయడంతో ఉద్రిక్తతగా మారింది.   ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.  ఈ వీడియోలు  సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. 

మరో వైపు హిందూ దేవాలయంపై  దాడిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు.   ఆలయంపై దాడి ఏ మాత్రం  ఆమోదయోగ్యం కాదన్నారు.  ఈ ఘటనపై వేంటనే స్పందించినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ట్రూడో . కెనడాలోని భారత హైకమిషన్  ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును తాము గౌరవిస్తామని   సంయమనం పాటించాలని కెనడా పోలీసులు కోరారు. అయితే హింసాత్మక,  నేరపూరిత చర్యలను తాము సహించబోమని చెప్పారు.  హింసకు పాల్పడే వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.

 ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కెనడాకు చెందిన భారత సంతతి రవాణా మంత్రి అనితా ఆనంద్ అన్నారు. అన్ని  మతాలు,హిందువులు స్వేచ్ఛగా తమ మతాన్ని ఆచరించే హక్కు ఉందన్నారు.  ఖలిస్తానీ తీవ్రవాదులు  రెడ్ లైన్‌ను దాటారని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య  ట్వీట్ చేశారు.