కెనడాలో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ అర్షా డల్లా అరెస్ట్

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సన్నిహితుడు అర్షా డల్లాను కెనడాలో అరెస్టు చేసినట్లు సమాచారం. కెనడాలో అక్టోబర్ 27, 28 జరిగిన కాల్పులపై పంజాబ్‌లోని మోగాకు చెందిన డల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 27,28 తేదీల్లో జరిగిన కాల్పులు అర్ష్ డల్లా హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు భారత భద్రతా సంస్థలకు సమాచారం అందింది.

ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరింత సమాచారం సేకరిస్తున్నాయి. అయితే, అధికారికంగా కెనడియన్ పోలీసులు లేదా ప్రభుత్వం అరెస్టు లేదా నిర్బంధాన్ని ధృవీకరించలేదు. భారతీయ భద్రతా సంస్థల మూలాల ప్రకారం, డల్లా తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. ఇండియా, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. డల్లా KTF చీఫ్ హర్దీప్ నిజ్జార్ అనుచరుడు, హర్దీప్ నిజ్జార్ హత్య కెనడా, ఇండియాల మధ్య గొడవలకు దారితీసింది. జనవరి 2023లో హోం మంత్రిత్వ శాఖ డల్లాను ఉగ్రవాదిగా ప్రకటించింది.