ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‎లో చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. చార్జింగ్ కోసం బ్యాకప్‎గా వాడుతోన్న పవర్ బ్యాంకుల వల్ల ఇటీవల తరుచు ప్రమాదాలు చేసుకుంటున్నాయి. ఇటీవల అమెరికాలోని ఓక్లహోమా సిటీలో పవర్ బ్యాంక్ పేలి ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విద్యుత్ నిల్వకోసం పవర్ బ్యాంక్‎లో ఉపయోగించే లిథియం -అయాన్ (లి-అయాన్)ను కుక్క కొరకడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ బ్యాంకుల వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో టెక్ నిపుణులు కొన్ని చిట్కాలు సూచించారు. వీటిని ఫాలో అయితే పవర్ బ్యాంకుల వల్ల కలిగే ప్రమాదాలను నివారించవచ్చని వారు చెబుతున్నారు. 

సాధారణంగా పవర్ బ్యాంకులలో విద్యుత్ నిల్వ కోసం లిథియం -అయాన్ (లి-అయాన్)ను వినియోగిస్తున్నారు. ఎక్కువ వేడి కావడం, షార్ట్  సర్కూ్ట్, ఇతర కారణాల వల్ల కొన్నిసార్లు ఈ లిథియం -అయాన్ పేలుడికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కింద టిప్స్ ఫాలో అయ్యి పవర్ బ్యాంకుల వల్ల జరిగే ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చు. 


టెక్ నిపుణుల టిప్స్

  • పవర్ బ్యాంక్ కెపాసిటిని బట్టి ఛార్జింగ్ అడాప్టర్‌ను ఎంచుకోవడం బెస్ట్. 
  • 10W నుండి 22.5W వరకు ఉండే ఛార్జర్లు పవర్ బ్యాంక్ చార్జింగ్ కోసం వినియోగించడం ఉత్తమం.
  • కొన్ని పవర్ బ్యాంక్‌లు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. వీటికి ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు.
  • పవర్ బ్యాంక్ కండిషన్‎ను తెలుసుకోవాలంటే ఒకసారి ఛార్జ్ చేసేటప్పుడు పరిశీలించండి. వేడిగా అనిపిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయండి.
  • పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేముందు ఒకసారి ఫోర్టులను తనిఖీ చేయండి. లేదంటే తేమ లాంటిది ఏమైనా ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగే పవర్ బ్యాంక్ పేలి ఛాన్స్ ఉంటుంది. 
  •  పవర్ బ్యాంక్ లేదా ఏదైనా ఇతర పరికరాలను ఛార్జ్ చేయడానికి ముందు పొడి గుడ్డతో పోర్ట్‌లను శుభ్రం చేయడం బెస్ట్.
  • పవర్ బ్యాంక్‌లలోని లిథియం-అయాన్ బ్యాటరీల వల్ల వాటిని ఎక్కువ వేడి కాకుండా చూసుకోవాలి.
  • ఎత్తైన ప్రదేశాల నుండి పవర్ బ్యాంకులను పడేవేయవద్దు.  
  • ఎక్కువ కాలం వాడుతోన్న పవర్ బ్యాంకులను పరిస్థితిని బట్టి మార్చడం బెటర్.
  • ఎక్కువ రోజులు ఉపయోగించే పవర్ బ్యాంకులు పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.