దేవరకొండ, వెలుగు: దేవరకొండను జిల్లా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతావత్ లాలూనాయక్కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి, కంబాలపల్లి, పొగిళ్ల లాంటి మారుమూల గ్రామాల ప్రజలు కలెక్టరేట్‌కు వెళ్లాలంటే 100 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవరకొండకు జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలు ఎప్పటి నుంచో జిల్లా కావాలని కోరుతున్నారని, ఈ మేరకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నేతలు వనం చంద్రమౌళి, ముదిగొండ ఎల్లేశ్, కామెపల్లి కొండల్తదితరులు ఉన్నారు.