కేరళ విపత్తు: విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ విపత్తుపై పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ Xలో స్పందించారు.  ఈ సంఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రజలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను పంచారు. 

ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు నా మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి క్షేమం కోసం నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత, బలంగా నిలబడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.