ఢిల్లీలో కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ నిర్మాణ పనులు నిలిపివేత

డెహ్రాడూన్: ఢిల్లీలో  కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ టెంపుల్ నిర్మాణ పనులను నిలిపివేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులను ఆపేస్తున్నట్లు కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ధామ్ ఢిల్లీ ట్రస్ట్ ఛీఫ్ సుమన్ మిట్టల్ వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విరాళాల స్వీకరణను కూడా నిలిపివేసినట్లు ప్రకటించారు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయం ఒకటి. కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ధామ్ హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్నది.

అచ్చం అలాంటి టెంపుల్ నే ఢిల్లీలోని బురారీలో కట్టాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే నిర్మాణ పనులు కూడా స్టా్ర్ట్ అయ్యాయి. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.  కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ పేరుతో నిర్మిస్తున్న ఢిల్లీలో నిర్మిస్తున్న ఆలయంతో హిందువుల సంప్రదాయాలు దెబ్బతింటాయని కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయ పూజారులు మండిపడ్డారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయానికి ప్రతిరూపంగా మరో చోట టెంపుల్ కట్టడం పురాతన ఆలయాన్ని అవమానించడమేనని తెలిపారు.

వెంటనే ఢిల్లీలో నిర్మాణ పనులు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయ నిర్మాణాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలు చేపట్టింది. వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆలయ నిర్మాణ పనులు ఆపేస్తున్నట్లు కేదార్‌‌‌‌‌‌‌‌నాథ్ ధామ్ ఢిల్లీ ట్రస్ట్ పేర్కొంది