రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది కేసీఆరే

  • టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్

నల్గొండ అర్బన్, వెలుగు : కమీషన్లే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ విధ్వంసం చేశారని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. మంగళవారం నల్గొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న నల్లగొండలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో టీజేఎస్ జిల్లా ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్లీనరీకి ముఖ్యఅతిథిగా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం హాజరవుతారని తెలిపారు. ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్​దేనన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పన్నాల గోపాల్ రెడ్డి, గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, కార్యదర్శి పులి పాపయ్య, ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్, పెరిక యాదయ్య, ఆర్ఎస్ ప్రకాశ్ నాయుడు పాల్గొన్నారు.