ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌కు హెచ్‌‌‌‌‌‌‌‌ఎం పోస్ట్​మంజూరు చేయాలి : కట్టా రవీంద్రచారి

తిమ్మాపూర్, వెలుగు: ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌కు హెడ్ మాస్టర్ పోస్ట్ మంజూరు చేసి, అర్హులైన టీచర్లతో భర్తీ చేయాలని ఎస్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఆర్ శ్రీనివాస్,  కట్టా రవీంద్రచారి డిమాండ్ చేశారు. 

సోమవారం తిమ్మాపూర్ మండలంలో ఎస్టీయూ సంఘ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎడ్, బీఎడ్, అర్హత కలిగిన టీచర్లకు ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ కల్పించాలని డిమాండ్​ చేశారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 4 డీఏలను వెంటనే మంజూరు చేసి, పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.