కస్తూర్బా స్కూల్​లో ఎంపీపీ ఆకస్మిక తనిఖీ : గరీబున్నీసా

  • నిర్వహణ లోపాలపై కలెక్టర్, డీఈవోలకు కంప్లైంట్​

లింగంపేట, వెలుగు: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ స్కూల్​ను మంగళవారం ఎంపీపీ గరీబున్నీసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో స్పెషల్​ఆఫీసర్​వసంతి లేకపోవడంతో వాకబు చేయగా బంధువులు చనిపోతే వెళ్లారని సిబ్బంది చెప్పారు. స్కూల్​లో 330 మంది స్టూడెంట్స్​కు 193 మందే అటెండయ్యారు.137 మంది గైర్హాజరు పట్ల ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు. సిబ్బందిని ప్రశ్నించగా సంక్రాంతి సెలవులకు వెళ్లి, ఇంకా రాలేదని సమాధానం చెప్పారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కోడిగుడ్డు కూడా ఇవ్వడం లేదంటూ బాలికలు ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. 9వ తరగతి పిల్లలు ఎక్కాలు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో ఎంపీపీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న స్పెషల్​ఆఫీసర్, స్టూడెంట్స్​వెనకబాటుకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గరీబున్నీసా కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్, డీఈవో రాజుకు ఫిర్యాదు చేశారు.