నవంబర్ 15న యాదగిరిగుట్టలో కార్తీక దీపోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈ నెల 15న కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా 'కార్తీక దీపోత్సవం' నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు. కొండపైన ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం 5.30 గంటల నుండి చేపట్టే ఈ దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.