కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!

కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన రోజు. కార్తీక పౌర్ణమిన  దేవాలయంలో దీపం వెలిగిస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల సమ్మకం.  పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తారు. అలాగే కేదారేశ్వర వ్రతం చేస్తే శుభాలు జరుగుతాయని అంటారు.  విష్ణువుని మత్స్యావతారంలో అలంకరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం దానం చేస్తారు. వాటితో పాటు కార్తీకపురాణ విశేషాలు తెలిపే పుస్తకాలు కూడా దానం ఇస్తే మంచిదని నమ్ముతారు

కార్తీక పౌర్ణమికి పురాణ నేపథ్యం ఉంది,  మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుడిని  సంహరించింది కార్తీక పౌర్ణమి రోజే.. ..  రాక్షసపాలన అంతమైందని ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి  పండుగగా జరుపుకున్నారట. కొందరు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. కేదారేశ్వరునికి మర్రి ఊడలను తోరణాలుగా కడతారు.   మర్రి పళ్లతో బూరెలు వండుతారు. మర్రి ఆకుల్లో ప్రసాదాన్ని పెట్టి పూజలు చేస్తారు. 

అంతేకాదు తులసి మాత కూడా కార్తీక పౌర్ణమి రోజే పుట్టిందని పండితులు చెబుతున్నారు.  అందువల్ల తులసిపూజ చేయడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. జైనులు, పంజాబీలకు  కూడా కార్తీక పౌర్ణమి ముఖ్యమైన రోజు ... గురునానక్​  పుట్టిన రోజు .. .  కార్తీక పూర్ణిమనే త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. 

తారకాసురునికి కొడుకులు ముగ్గురు... బ్రహ్మ కోసం తపస్సు చేసి .... రథంమీద ...  విల్లుకాని విల్లుతో..  బాణం కానీ బాణంతో...  ఒకే సరళరేఖలో మాత్రమే చనిపోయే విధంగా వరం పొందుతారు. వాళ్ల పాపాలు పెరిగిపోవడంతో శివుడు భూమిని రథంగా, మేరు పర్వతాన్ని విల్లుగా, ఆదిశేషుడై అల్లినాడుగా. మహా విష్ణువును బాణంగా మార్చి త్రిపురాసురు లను సంహరించాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీకపౌర్ణమి రోజు దేవాలయాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుంటారు. సాయంత్రం ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు.  బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో ఆవునెయ్యిపోసి, దీపాలు వెలిగిస్తే మంచిదంటారు. ఆవు నెయ్యి దొరకని వాళ్లు నువ్వుల నూనె వాడుతారు.  ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. శివాలయాలు సాయంత్రానికల్లా దీపాలతో ప్రకాశి స్తాయి. కొలనులు, కోనేరులు, నదులు... అన్నీ భక్తులు వెలిగించిన దీపాల దోనెలతో కాంతులు వెదబల్లుతాయి. 

Also Read : కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలి

కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి శివాలయాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. కార్తీకపౌర్ణమిరోజు ఆకాశదీపాన్ని దర్శించు కుంటే శివుడిని చూసినంత భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తమ శక్తి కొలు పేదలకు దానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. 365 ఒత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుందని అంటారు. అంటే. ఒక్కోరోజుకు ఒక్కో ఒత్తి అన్నమాట. దీపాలను అరటి దోనెలో పెట్టి దేవాలయంలోని కోనేటిలో, సదుల్లో వదులుతారు. కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇంటి ముందు తులసికోట దగ్గర వెలిగిస్తే సర్వదోషాలు పోతాయట. 

ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉన్నారుకమివి బంధా నాన్ మృత్యోర్ మృక్షీయ మామృతాత్" 

అనే మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు  జపం చేస్తే  రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. పెళ్లైన యువతలు దీపాలను అరటి దోనెల్లో  వదలడం వల్ల మంగళ ప్రదంగా జీవిస్తారని నమ్ముతారు.

జ్వాలా తోరణం 

కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలాతోర ణం వెలిగిస్తారు. ఈ తోరణం కిందనుంచి అటు ఇటు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంత లభిస్తుందని నమ్ముతారు. పాలసముద్రంలో పుట్టిన విషాన్ని పరమేశ్వరుడు మింగిన తర్వాత ఆ వేడిని తట్టుకో లేకపోతాడు. వేడి తగ్గించమని పార్వతీదేవి అగ్నిని వేడుకుంటుంది. అగ్ని తన సహజ స్వభావాన్ని కొంత తగ్గించుకుంటారు. అందుకు కృతఙ్ఞతగా పార్వతీదేవి కార్తీకపౌర్ణమి రోజు జ్వాలాతోరణం  కడుతుంది. 

ఆ తోరణం కిందనుంచి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లారు. అప్పటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో జ్వాలాతోరణాలు ఏర్పాటు చేయటం ఆచారంగా మారిందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నారు.  దీనిని చూసిన మనుషులకు, జంతువులకు, పక్షులకు క్రిమికీటకాలకు కూడా మరోజన్మ ఉందడని సమ్ముతారు.జ్వాలాతోరణం కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను నుదుటి మీద పెట్టుకుంటే భూత, ప్రేత, పిశాచాల పీడ ఉండదని విశ్వసిస్తారు.

పౌర్ణమి రోజు నిండు చంద్రుడు కాంతివంతంగా కలిపిస్తాడు. భూమి మీద చల్లని కాంతులను ప్రసరింపజేస్తాడు. కార్తీకపౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడితే నరాలు, కళ్లకు సంబంధించిన చిన్నచిన్న ఇన్ ఫెక్షన్స్ ఉంటే తగ్గు తాయి. పైగా మిగిలిన పౌర్ణమిల కన్నా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కాంతి ఎక్కువగా ఉంటుంది. 

అందుకే నాలుగు నుంచి అయిదు  నిమిషాలు తప్పకుండా చంద్రుడి కాంతి శరీరం మీద పడేలా చూసుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసి, చలిమిడిని దేవుడికి ప్రసాదంగా పెడతారు. సాయంత్రం చలిమిడిని తినడం వల్ల పొట్టకు చలువ చేస్తుంది. చలిమిడి స్త్రీలలో గర్వాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.

కార్తీకపౌర్ణమి రోజు ప్రతి శివ, వైష్ణవాలయాలు  భక్తులతో కిటకిటలాడుతాయి.  తెల్లవారుజామునుంచే భక్తులు స్నానాలు చేసి దేవుడి దర్శనం కోసం స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు ఉపవాసం ఉండటం వల్ల దేవాలయంలోనే  కార్తీకపురాణాన్ని పారాయణం చేస్తారు కాబట్టి వంటూ ఆనందిస్తారు. కొందరు ఈ రోజు సత్యన్నారాయణ స్వామి ప్రతాన్ని కూడా చేసుకుంటారు. ఇంకా కార్తీకవ్రతం, నోములు వంటివి వాళ్ల ఆచారాలను బట్టి పాటిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాలకు వెళ్లి శివుడి దర్శించుకుంటారు. ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు. బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి, దీపాలు వెలిగిస్తే మంచిదని చెప్తారు. ఆవునెయ్యి  దొరకని వాళ్లు నువ్వుల నూనె వాడుతారు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు.

-వెలుగు, లైఫ్​–