హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్ధరాత్రి కారు హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్​

హుజూరాబాద్, వెలుగు : హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ కారుతో యువకులు హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ఓ కారులో స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెళ్తూ అదుపుతప్పి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మూలమలుపు వద్ద ఓ ఇంటిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇంటి ముందు మెట్లను గుద్దుకుంటూ అక్కడే ఉన్న కారు, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టారు. 

ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఇంటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోల్ట్స్​ సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన ఆ ముగ్గురిని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అనంతరం ఆస్తి నష్టానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.