ఫుడ్ పాయిజన్‌‌‌‌తో విద్యార్థులకు అస్వస్థత

  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌ శర్మనగర్‌‌‌‌ గర్ల్స్‌‌‌‌ బీసీ గురుకులంలో ఘటన

కరీంనగర్ సిటీ, వెలుగు : కరీంనగర్  నగరంలోని శర్మనగర్  జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ఫుడ్  పాయిజన్ తో 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి కాలిఫ్లవర్, సాంబారుతో భోజనం చేసిన విద్యార్థినులు కడుపునొప్పి రావడం, వాంతులు చేసుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకోవడంతో 23 మందిని డిశ్చార్జ్  చేశారు. మరో 8 మందిని  రాత్రి వరకు ఇంటికి పంపిస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్  వీరారెడ్డి తెలిపారు.

ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ తో ఫోన్​లో మాట్లాడారు. స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ప్రమాదమేమీ లేదని కలెక్టర్  పమేలా సత్పతి మంత్రికి వివరించారు. అడిషనల్  కలెక్టర్  లక్ష్మీ కిరణ్, సుడా చైర్మన్  కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, బీజేపీ నేతలు పరామర్శించారు. ఘటనపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్  చేశారు.