బీ అలర్ట్.. ఆన్ లైన్లో పెట్టుబడులు పెడుతున్నారా.?

ఆన్ లైన్ లో పెట్టుబడులు పెడుతూ.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ మధ్య సైబర్ నేరస్థుల బారిన పడి వేలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. ముక్కూ.. మొహం తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఆన్ లైన్ లో  లక్షలకు లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు.. తర్వాత  మోసపోయామని తెలిశాక లబోదిబోమంటున్నారు.. అందుకనే తెల్వని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లు వస్తే  జాగ్రత్తగా ఉండండి.. ఆన్ లైన్ లో  పెట్టుబడులు పెడితే అధిక డబ్బు వస్తది..రెట్టింపు డబ్బు వస్తదని ఎవరైనా చెబితే  గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే అసలుకే మోసం వస్తది..ఉన్నది కాస్త దోచుకుంటారు.. లేటెస్ట్ గా ఇలాంటి ఘటనే కరీంనగర్ లో జరిగింది..ఆన్ లైన్ లో పెట్టుబడి పెడితే అధిక డబ్బు వస్తుందని నమ్మించి ఓ వ్యక్తి నుంచి 30 లక్షలు దోచేశారు. 

 తెలంగాణ,  మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ క్రైమ్ కు పాల్పడిన గుజరాత్ కు  చెందిన షేక్ అఫ్తాబ్,  దివాన్ మురద్‌షా  అనే ఇద్దరు నిందితులను  కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మద్ ఖాన్ అనే మరో ప్రధాన నిందితుని కోసం గాలిస్తున్నారు..పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  ఆన్ లైన్లో పెట్టుబడి పెడితే సంపద పెరుగుతుందని నమ్మించి కరీంనగర్ జ్యోతి నగర్ కు చెందిన పచ్చునూరి సురేందర్ నుంచి రూ.30 లక్షల 60 వేల రూపాయలు కాజేశారు.  బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కరీంనగర్ సైబర్ పోలీసులు..  గుజరాత్  అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్‌ కు వెళ్లి అక్టోబర్ 23న నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.

ALSO READ | జాగ్రత్త : కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు

గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్ఖేజ్ కు  చెందిన షేక్ అఫ్తాబ్,  దివాన్ మురద్‌షా అనే ఇద్దరు పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని ఆపరేట్ చేస్తూ మోసానికి పాల్పడ్డాడు  అహ్మద్ ఖాన్.  వాట్సాప్ ,టెలిగ్రామ్ ద్వారా కరీంనగర్ జ్యోతినగర్ కు చెందిన  పచ్చునూరి సురేందర్  మొబైల్ కు మెసేజ్ పంపించాడు. బంగారం, XRPలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను  త్వరగా పెంచుకోవచ్చని మాయమాటలు చెప్పాడు.  పెట్టుబడి పెట్టేందుకు వీలుగా కొన్ని మొబైల్ యాప్ లింకులను సురేందర్ కు  పంపించాడు నిందితుడు. 

దీంతో అతడిని నమ్మి 30 లక్షల 60 వేల రూపాయల నగదు బదిలీ చేసిన బాధితుడు సురేందర్ . తాను పంపించిన నగదు పెట్టుబడి ఖాతాలోకి వెళ్లకుండా మోసగాళ్లు కాజేసినట్లు గుర్తించి పోలీసుల సాయం కోరాడు సురేందర్.  పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ అహ్మదాబాద్ సర్ఖేజ్ ప్రాంతంలో షేక్ అఫ్తాబ్, దివాన్ మురాద్‌షాలను గుర్తించారు పోలీసులు. ఇద్దరిని అక్కడే అదుపులోకి తీసుకొని అహ్మదాబాద్  మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై అక్టోబర్ 25న కరీంనగర్‌కు తీసుకువచ్చారు పోలీసులు.  జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోసం కరీంనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. నిందితులు తెలంగాణ , మహారాష్ట్రలో క్రైమ్ లింకులు కలిగి ఉన్నారు. ప్రధాన నిందితుడైన అహ్మద్ ఖాన్ అరెస్టు కోసం వీరిద్దరిని మళ్లీ పోలీస్ కస్టడికి తీసుకుంటామని  సైబర్ టీం పోలీసులు వెల్లడించారు..