పెండింగ్‌‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి : సీపీ​ అభిషేక్​మహంతి

చిగురుమామిడి, వెలుగు: పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని కరీంనగర్ సీపీ అభిషేక్​మహంతి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. స్టేషన్‌‌లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలనీ సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై రౌడిషీట్​ ఓపెన్‌‌ చేయాలన్నారు. 

స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఆయనతోపాటు తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎస్సై రాజేశ్​ఉన్నారు.