కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసుల సైకిల్ ర్యాలీ

కరీంనగర్ క్రైమ్, వెలుగు: పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైకిల్ ర్యాలీ  నిర్వహించారు. సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ క్వార్టర్స్ నుంచి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్, ఇందిరా చౌక్, మంచిర్యాల చౌరస్తా, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ముగిసింది. 

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ  అనోక్ జయ్ కుమార్, ఏసీపీలు విజయ్ కుమార్, మాధవి, నరేందర్, వెంకటరమణ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు కోటేశ్వర్, విజయకుమార్, జాన్ రెడ్డి, స్వామి, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిజర్వు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు రజినీకాంత్, కుమారస్వామి, జానీమియా, శ్రీధర్ రెడ్డి, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.