కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో అర్జీలు సమర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారం కోసం అధికారులకు పంపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 115 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి
56 అర్జీల వచ్చాయన్నారు.