ట్రాన్స్ జెండర్ల స్వయం ఉపాధికి చేయూత ఇస్తాం.. : పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా అండగా ఉండి, స్వయం ఉపాధికి చేయూతనందిస్తామని  కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం కలెక్టర్  లో ట్రాన్స్ జెండర్లతో సమావేశం నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చారు. ట్రాన్స్ జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే..  ప్రైవేట్ బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.  

ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్ శిక్షణ పొందాలని సూచించారు. ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తగిన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు.  రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.