పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి 

  •   కలెక్టర్ పమేలా సత్పతి 

మానకొండూర్,వెలుగు: ఊరును శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో పలువురు పారిశుధ్య కార్మికులకు హెల్త్‌‌‌‌ కార్డులు, బీమా పత్రాలు, రక్షణ సామగ్రిని అందజేశారు. అనంతరం సఫాయి మిత్ర సురక్ష కింద కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సుమారు 1400 మంది జీపీ, మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య కార్డులు అందిస్తామన్నారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ జిల్లాలోని పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేటర్ వెంకటేశ్‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌వో సుజాత, డీఆర్డీవో  శ్రీధర్, పీహెచ్‌‌‌‌సీ మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సౌమ్య, సీహెచ్‌‌‌‌వో రాజునాయక్, ఎంపీడీవో వరలక్ష్మి, ఇతర అధికారులు 
పాల్గొన్నారు.