కరీంనగర్, వెలుగు: ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో కొత్త డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలాసత్పతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం హెచ్‌డబ్ల్యూవోలు, స్పెషలాఫీసర్లు, వెల్ఫేర్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ అన్ని హాస్టళ్లో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహార మెనూను అమలు చేయడం హర్షణీయమన్నారు. ఈ నెల 14న జిల్లాలోని 110 సంక్షేమ హాస్టళ్లలో కొత్త డైట్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్ రావు, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నాగలేశ్వర్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, వసతిగృహాల ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
పేరెంట్స్‌ను ఆహ్వానించాలి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఈనెల 14న కామన్ డైట్ ప్రారంభోత్సవానికి పిల్లల పేరెంట్స్‌ను ఆహ్వానించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కామన్ డైట్ డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.
ప్రభుత్వం గతంలో ఉన్న డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం మేర పెంచిందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఈవో జగన్మోహన్ రెడ్డి, వివిధ స్కూళ్ల ప్రిన్సిపాల్స్,
విద్యాశాఖ అధికారులు, పాల్గొన్నారు.