ఆరోగ్య మహిళా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

శంకరపట్నం,వెలుగు: ఆరోగ్య మహిళా క్యాంపును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శంకరపట్నం మండలం కేశవపట్నం పీహెచ్ సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు.  దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్లు చెక్‌‌‌‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని మందులను వాడాలన్నారు.

విద్యార్థులకు మల్టీ విటమిన్ మాత్రలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌‌‌‌వో వెంకటరమణ, తహసీల్దార్ బత్తుల భాస్కర్, ఎంపీవో ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు