మహిళలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి 

కరీంనగర్, వెలుగు: జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు 100 శాతం పూర్తి చేయాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సిటీలోని లక్ష్మీనగర్ లో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లు ఆరోగ్య మహిళ కార్యక్రమంపై దృష్టి పెట్టాలన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా సుమారు రూ.50 వేలు ఖరీదు చేసే 54 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 

 గ్రూప్ 2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి 

జిల్లాలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. పరీక్షల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులు సెంటర్​కు గంట ముందే చేరుకోవాలని, టీజీపీఎస్సీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, అడిషనల్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో సాజిదా, కార్పొరేటర్ స్వప్న, డీసీపీవో పర్వీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి అడ్మిన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజన్నసిరిసిల్ల, వెలుగు:రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సందీప్​ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల, వేములవాడలో 26  పరీక్ష కేంద్రాల్లో 7163 అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ చేసే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1.30 నుంచి 
అనుమతిస్తామన్నారు.