కలెక్టర్​గా పాలన.. తల్లిగా లాలన..

గంగాధర, వెలుగు : కరీంనగర్​కలెక్టర్​పమేలా సత్పతి ఓ వైపు పాలన సాగిస్తూ.. మరోవైపు తల్లిగా తన కొడుకును లాలిస్తోంది. గంగాధర మండలం మధురానగర్​లో కొత్తగా ఏర్పాటు చేసిన కో – ఆపరేటివ్​ అర్బన్​బ్యాంకు ప్రారంభోత్సవానికి ఆదివారం ఆమె వెళ్లారు.

కాగా.. స్కూల్​కు హాలి డే కావడంతో కలెక్టర్​తన కొడుకు ఆయుష్​తో కలిసి ప్రోగ్రాంకు అటెండ్​ అయ్యారు. ఇలా కలెక్టర్​కొడుకును ఒడిలో కూర్చోపెట్టుకుని  లాలించారు