కారేపల్లి పోలీసులు.. 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కారేపల్లి, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్ ఫోర్స్, కారేపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కారేపల్లి ఎస్సై రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం...టీఎస్ 02టి 0009 నంబర్ లారీ, ఏపీ 02వై3691 ట్రాలీ లో 288 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా మండలంలోని పంతుల్ నాయక్ తండ సమీపంలో పట్టుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇల్లందు కు చెందిన లారీ డ్రైవర్ సంతోష్, ట్రాలీ డ్రైవర్ భూక్య నాగరాజు, వేపల గడ్డ కు చెందిన అక్రమ రేషన్ బియ్యం వ్యాపారి బానోత్ కోటేశ్​ను  అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.