సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడి పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్సులు : కరండ్ల మధుకర్

మేడిపల్లి (జగిత్యాల), వెలుగు: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేడిపల్లి మండలం గోవిందారం ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు దాక్షాయిని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మధుకర్ రూ. 10 వేలు విలువ చేసే ట్రాక్ సూట్లు, స్పోర్ట్ డ్రెస్సులను శుక్రవారం అందజేశారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదివిన విద్యార్థులు ఆటల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించారని గుర్తు చేశారు. అనంతరం మధుకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీచర్లు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం హసేక్ హుస్సేన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బాసూజీ కవిత, దాక్షాయిని స్వచ్ఛంద సంస్థ సభ్యులు పోతురాజు సురేశ్‌‌‌‌‌‌‌‌, భూపతి, తిరుపతి పాల్గొన్నారు.