శాంత్రి భద్రతలకు విఘాతం కలిగిస్తే  రౌడీషీట్ ​ఓపెన్​ చేయండి : ఎస్పీ సింధూశర్మ 

కామారెడ్డి​, వెలుగు:  ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీ షీట్​ ఓపెన్​ చేయాలనికామారెడ్డి  ఎస్పీ సింధూశర్మ  అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో నెలవారీ రివ్యూ మీటింగ్​ జరిగింది.  పోలీస్​ స్టేషన్ల వారీగా నెల రోజుల్లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు  వివరాలు ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్​కేసుల గురించి ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్​పెంచి,  దర్యాప్తు త్వరగా పూర్తిచేయాలని సూచించారు.  క్షేత్రస్థాయిలో పోలీస్​పెట్రోలింగ్​ను పెంచాలన్నారు.  సైబర్​క్రైంపై  ప్రజలకు అవగాహన కల్పించాలని,  రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్​చేయాలన్నారు.  టైపర్​ రైటర్​ట్రైనింగ్​కంప్లీట్ చేసిన8 మంది మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో  అడిషనల్​ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.