వాడీవేడిగా కామారెడ్డి మున్సిపల్​ మీటింగ్​

  • ఫండ్స్​ డైవర్షన్​ ఎలా చేస్తారని  కౌన్సిలర్ల ప్రశ్నలు
  •  నెలలు గడుస్తున్నా  స్ట్రీట్​లైట్లు పెట్టడంలేదని ఆగ్రహాం
  •  పని చేయని లైట్లు తీసుకొచ్చి మీటింగ్​లో  నిరసన 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్​చివరి మీటింగ్​ గురువారం వాడీవేడిగా జరిగింది.  చైర్​పర్సన్​గడ్డం ఇందుప్రియ అధ్యక్షతన మున్సిపల్​ మీటింగ్​ జరిగింది.  సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు హాజరయ్యారు.  ఈనెల  ఆఖరుకు మున్సిపాల్​పాలక వర్గం గడువు ముగియనుంది.  ఈ నేపథ్యంలో పలు ఆంశాలు,  ఫండ్స్​ కేటాయింపులకు సంబంధించిన అజెండాపై చర్చించారు.

 15వ ఆర్థిక సంఘం జనరల్​ వర్క్స్​కు డైవర్ట్ చేయడంపై పలువురు సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక ఫండ్స్​ను జనరల్​ ఫండ్స్​ బిల్లులకు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నించారు.  కొన్ని వార్డుల్లోనే డెవలప్​మెంట్​వర్క్స్​చేస్తున్నారని, మిగతా వార్డుల పరిస్థితి ఏమిటంటూ సమావేశంలో  ప్రస్తావించారు. వార్డుల్లో గత రెండు నెలలుగా స్ట్రీట్​ లైట్లు వెలగడం లేదని, లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పిన పట్టించుకోవట్లేదన్నారు.  కాంట్రాక్టర్​ను అడిగితే తనకు బిల్లులు చెల్లించటం లేదని చెబుతున్నారన్నారు.  

మూడు నెలలుగా తన వార్డులో  పని చేయని లైట్లను తెచ్చి టెకిర్యాల్​కౌన్సిలర్​ శంకర్​రావు నిరసన  తెలిపారు. లైట్ల బిగింపునకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.   వాటార్​ వర్క్స్​ ఫిల్టర్​ బెడ్​ వద్ద ఉన్న పాత సామగ్రిని అమ్మివేయటంపై సభ్యులు ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్​ స్పందన తెలిపారు.   పాలక వర్గం గడువు ముగియనుండడంతో  పలు అంశాలకు అమోదం తెలిపారు.