స్థానిక సంస్థల ఎన్నికల్లో  అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు:  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.  గురువారం కామారెడ్డి టౌన్​కు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ..   ఏడాది పాలనలో కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.  

ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలు ఇంకా నేరవేర్చలేదన్నారు.  మహారాష్ర్ట, జార్ఖండ్​ రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.  పార్టీ టౌన్​ ప్రెసిడెంట్​ ఆకుల భరత్​, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ మోటూరి శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.

రెసిడెన్షియల్​ స్కూల్​ తనిఖీ 

మాచారెడ్డి ఎస్టీ  బాలికల  మినీ రెసిడెన్షియల్​ స్కూల్​ను గురువారం  కామారెడ్డి  ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.    విద్యార్థులతో మాట్లాడి  వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన భోజనం పెట్టడంతో పాటు, మంచి విద్యాబోధన అందించాలని టీచర్లకు సూచించారు.