ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

  • ఈ నెల11 నుంచి 14 వరకు హర్​ఘర్​తిరంగా ప్రోగ్రాం   ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, 
  • పార్టీ జిల్లా ప్రెసిడెంట్​అరుణతార

కామారెడ్డిటౌన్,వెలుగు : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. హర్​ఘర్​తిరంగా ప్రోగ్రాం బీజేపీ సన్నాహాక మీటింగ్​పార్టీ జిల్లా ఆఫీసులో శుక్రవారం జరిగింది.  ఎమ్మెల్యే మాట్లాడుతూ..  జాతీయభావం పెంపొందించేందుకే హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం చేపడతున్నామన్నారు.  ఆగస్టు15న జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండేలా బీజేపీ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార మాట్లాడుతూ..  హార్​ఘర్​తిరంగా ప్రోగ్రాంను ఈ  నెల 11 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నామన్నారు.  బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.   లీడర్లు రవీందర్ రావు, నరేందర్​రెడ్డి, తేలు శ్రీను, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్​, నంది వేణు తదితరులు పాల్గొన్నారు.