ప్రధానిని కలిసిన  ప్రజాప్రతినిధులు

నిజామాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో   ప్రజా ప్రతినిధుల బృందం బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.  ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు,రాబోయే స్థానిక ఎన్నికలపై చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రధాని  దిశనిర్దేశం చేసినట్లు తెలిపారు.

 
కామారెడ్డి, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలిశారు.  తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారన్నారు.