తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

  •     కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ నరేంద్రమోదీ పాలన కోరుకుంటున్నారన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా  శనివారం కామారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 400కు స్థానాల్లో  విజయఢంకా మోగిస్తామన్నారు. ప్రజలు పారదర్శక, నిజాయతీ పాలనను కోరుకుంటున్నారన్నారు. విజయ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్రంలో గత ప్రభుత్వ

ప్రస్తుత ప్రభుత్వాల అధ్వాన పాలనను ప్రజలకు వివరించామన్నారు. స్టేట్​లో గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు. ఆఫీసర్లను మార్చడం, పైసలు తీసుకొని ఆఫీసర్ల పోస్టింగ్స్​ఇస్తున్నారని వాపోయారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి, ఆదాయం పెంపుపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదన్నారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఈ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసేలా ఉందన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో కొందరు ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అప్పజెప్పి పోస్టింగులు తెచ్చుకుంటున్నారని, వీరు ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. జిల్లా ప్రెసిడెంట్​ అరుణతార, ఇన్​చార్జి బద్ధం మహిపాల్, రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు నీలం చిన్నరాజులు, లీడర్లు పాల్గొన్నారు.

గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో బీజేపీనే

గల్లీలో ఎవరున్నా  ఢిల్లీలో మాత్రం బీజేపీ ప్రభుత్వమే ఉంటుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి నుంచి మాచారెడ్డి వరకు ర్యాలీ నిర్వహించారు. మాచారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్​పా ర్లమెంట్​ స్థానం బీజేపీ ఖాతాలో పడడం ఖాయమన్నారు. పార్టీ జిల్లా వైస్​ప్రెసిడెంట్ వెంకట్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.