- చీప్ సెక్రెటరీకి కామారెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిటౌన్ తో పాటు , నియోజకవర్గం పరిధిలో అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ, అసైన్డు భూముల కబ్జాపై ఎంక్వైరీ చేయాలని కోరుతూ చీప్ సెక్రెటరీ శాంతికుమారికి గురువారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. కామారెడ్డి టౌన్ లో రూల్స్‌కు విరుద్ధంగా లే అవుట్లు చేశారని, అక్రమ కట్టడాలు, ఓపెన్ స్థలాల్లో కొన్ని కబ్జాకు గురయ్యాయని, మున్సిపాలిటీలో అవినీతిపై ఎంక్వైరీ చేయాలన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.