కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌వో అరెస్ట్‌‌‌‌

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌వో లక్ష్మణ్‌‌‌‌సింగ్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేసి గురువారం కోర్టులో హాజరు పరిచారు. లైంగిక వేధింపులతో పాటు, అసభ్యకర మాటలతో వేధిస్తున్నారని పలువురు మహిళా మెడికల్‌‌‌‌ ఆఫీసర్లు ఉన్నతాధికారులతో పాటు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై పబ్లిక్‌‌‌‌ హెల్త్‌‌‌‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ అమర్‌‌‌‌సింగ్‌‌‌‌ నాయక్ బుధవారం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేశారు.

అప్పటికే మెడికల్‌‌‌‌ ఆఫీసర్ల ఫిర్యాదుతో దేవునిపల్లి పీఎస్‌‌‌‌లో ఐదు కేసులు నమోదు కాగా, బుధవారం రాత్రి మరో రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎంహెచ్‌‌‌‌వోను అదుపులోకి తీసుకొని కామారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణకు సహకరించాలని, వారంలో ఒక రోజు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో హాజరుకావాలని కండిషన్‌‌‌‌ బెయిల్‌‌‌‌పై విడిచిపెట్టినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌‌‌‌రావు తెలిపారు. అలాగే డీఎంహెచ్‌‌‌‌వోపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేసేందుకు కొందరు మెడికల్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ వెళ్లారు. 

 ఆఫీస్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌పై కేసు నమోదు 

డీఎంహెచ్‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ శ్రీనునాయక్‌‌‌‌పై దేవునిపల్లి పీఎస్‌‌‌‌లో కేసు నమోదైంది. అసభ్యకర మాటలతో వేధిస్తున్నారని మహిళా మెడికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఫిర్యాదు చేయడంతో శ్రీనునాయక్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.