సెల్​ఫోన్ల​ రికవరీలో  కామారెడ్డి జిల్లా టాప్ .. ఒకేసారి 1000 పోన్ల రికవరీ

కామారెడ్డి టౌన్, వెలుగు: సీఈఐఆర్​అప్లికేషన్​ద్వారా సెల్​ఫోన్ల​ రికవరీలో  కామారెడ్డి జిల్లా టాప్​ప్లేస్​లో (కమిషనరే ట్స్​మినహా) ఉందని ఎస్పీ సింధూశర్మ  బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్స్​తో కలిపి ఐదో స్థానంలో ఉందన్నారు.

పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్​ఫోన్లలో ఇప్పటికే 1,053 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. బాన్సువాడ డివిజన్​లో 442, కామారెడ్డిలో 398,  ఎల్లారెడ్డిలో 213 ఫోన్లను రివకరీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా తమ మొబైల్స్​ పొగొట్టుకుంటే వెంటనే పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ చేసి, సీఈఐఆర్​ అప్లికేషన్​లో ఎంట్రీ చేయాల్నారు.