గ్రామాలకు రెడ్​క్రాస్​ సేవలు విస్తరించాలి : కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : రెడ్​క్రాస్​ సొసైటీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో  జిల్లా మెనేజ్​మెంట్​కమిటీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో రెడ్​క్రాస్​సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

రెడ్​క్రాస్​ సోసైటీలో సభ్యులను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని సూచించారు.  కార్యక్రమంలో సొసైటీ చైర్మన్​ ఎం.రాజన్న,  సీపీవో రాజారాం,  ఐసీడీఎస్ పీడీ బావయ్య,  ప్రతినిధులు రఘుకుమార్, నర్సింహం, సంజీవరెడ్డి,  రమేశ్​రెడ్డి పాల్గొన్నారు.