పర్యాటక కేంద్రంగా నాగన్నబావి

  • కలెక్టర్ ఆశిశ్​సాంగ్వాన్

లింగంపేట, వెలుగు: లింగంపేటలోని పురాతన నాగన్నబావిని శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్​సాంగ్వాన్​, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. నాగన్నబావి కనుమరుగవుతున్న సమయంలో ఇన్ఫోసిస్, రెయిన్​వాటర్​ప్రాజెక్టు ఆధ్వర్యంలో​బావి పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్​పూర్వవైభవం తీసుకురావడం అభినందనీయమని కలెక్టర్​ కొనియాడారు.  ప్రాచీన కట్టడాల పునరుద్ధరణతో భావితరాలకు చరిత్ర తెలిసే వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో  సబ్​కలెక్టర్​ కిరణ్, ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, ఎంపీడీఓ నరేశ్, ఏపీఎం శ్రీనివాస్ దితరులు పాల్గొన్నారు.