స్టూడెంట్స్​ క్లాస్​లకు హాజరయ్యేలా చూడాలి : కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఇంటర్మీడియెట్​స్టూడెంట్స్​ క్లాస్​లకు హాజరయ్యేలా చూడాలని  కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​ కాలేజ్​ప్రిన్సిపాల్స్​ను ఆదేశించారు.   గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ  స్టూడెంట్స్​కు క్లాస్​లకు హాజరయ్యేందుకు మోటివేషన్​ క్లాసులు నిర్వహించాలన్నారు.    మోటివేషన్​ సినిమాలను ప్రదర్శించాలని సూచించారు.  గత ఏడాది ఇంటర్​ఉత్తీర్ణత శాతంలో జిల్లా చివరి స్థానంలో ఉందని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

ఇప్పటి నుంచే ఫ్లానింగ్​తో ముందు కెళ్లాలన్నారు.  ప్రతీనెల పేరెంట్స్​ మీటింగ్​లు ఏర్పాటు చేయాలని,   స్టూడెంట్స్​హాజరు శాతం పెంచేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీవోల సహకారం తీసుకోవాలన్నారు.   సకాలంలో కాలేజ్​కి వచ్చేందుకు రవాణా సమస్యలను  కలెక్టర్​ దృష్టికి ప్రిన్సిపాల్స్​తీసుకొచ్చారు.  బస్సుల విషయంలో ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడతానని చెప్పారు.  ఇంటర్​ నోడల్​ ఆఫీసర్​ షేక్​సలాం పాల్గొన్నారు.