మహిళలు ఆర్థికంగా ఎదగాలి

కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వం  మహిళలకు కల్పిస్తున్న  పథకాలను ఉపయోగించుకొని, ఆర్థికంగా  ఎదగాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ తెలిపారు.   ఇందిరా మహిళ శక్తి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్​లో భాగంగా గాంధారి  మండల  స్వయం సహాయక సంఘం మెంబర్​ లతకు శాంక్షన్​ అయిన మొబైల్​ఫిష్​ యూనిట్​ ఆటోను  సోమవారం కలెక్టర్​ ప్రారంభించారు.  ఫిష్​తో కొత్త రకం వంటకాలు చేస్తూ వ్యాపారంలో రాణించాలన్నారు.   అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, డీఆర్​డీవో సురేంధర్​,  జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.