కామారెడ్డి, వెలుగు: వరద బాధితులకు ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో వరద నీరు చేరిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులకు మాట్లాడారు. భిక్కనూరు నుంచి కామారెడ్డి వరకు ఉన్న నేషనల్ హైవేను పరిశీలించారు. వర్షానికి పడిన గుంతలను పూడ్చాలని హైవే ఆథారిటీ ఆఫీసర్లకు ఆదేశించారు. ఆయన ఆర్డీవో రంగనాథ్‌రావు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో శ్రీనివాస్, మండల స్థాయి ఆఫీసర్లు ఉన్నారు.
హాస్టల్తనిఖీ
పాల్వంచలో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ బాయిస్హాస్టల్ను తనిఖీ చేశారు. స్టూడెంట్స్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా స్టూడెంట్స్‌కు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.