నిజాంసాగర్ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ .. జూనియర్​ అసిస్టెంట్​ సస్పెన్షన్

  • ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ 
  • ల్యాబ్​ టెక్నిషీయన్‌‌‌‌‌‌‌‌కు మెమో 
  • రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా

నిజాంసాగర్​(ఎల్లారెడ్డి), వెలుగు:  నిజాంసాగర్ మండలంలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌సీని  గురువారం కామారెడ్డి కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  అటెండెన్స్​రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.  జులై 27 నుంచి  జూనియర్​ అసిస్టెంట్​సుభాష్ డ్యూటీకి రావడం లేదని అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో చంద్రశేఖర్ కు ఆదేశించారు.  ల్యాబ్​ టెక్నిషీయన్ నవ్యశ్రీ కూడా డ్యూటీకి రాకపోవడంతో మెమో ఇచ్చి వివరణ కోరాలని ఆదేశించారు. అనంతరం అక్కడి రోగులతో కలెక్టర్ మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ రోహిత్ కుమార్ కు సూచించారు.  

అనంతరం గవర్నమెంట్​ హైస్కూల్​ను పరిశీలించారు.  ఆమ్మ ఆదర్శ స్కూళ్ల పనులను పరిశీలించారు. మెనూ ప్రకారం క్వాలిటీ భోజనం స్టూడెంట్స్​కు పెట్టాలని  ఏజేన్సీ నిర్వాహకులను ఆదేశించారు. క్లాస్​ రూమ్స్​లోకి వెళ్లి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడారు.  వడ్డేపల్లిలో పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.  పంటల సాగు వివరాలను సర్వే నంబర్లతో నమోదు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్ కు సూచించారు.  

ఎంపీడీవో ఆఫీసులో  ప్రజాపాలన సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.  ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారా? లేదా అని తెలుసుకున్నారు. జాబ్​కార్డు ఉన్న వారికి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు.  నిజాంసాగర్​ ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ ఆఫీసర్ల కలెక్టర్ కు వివరించారు. డీఎంహెచ్​వో చంద్రశేఖర్​,  డీఆర్​డీవో చందర్​,  ఆర్డీవో  రమేశ్​ రాథోడ్​, ఆఫీసర్లు ఉన్నారు.