ఆ శివాలయానికి వెళితే.. పక్కా పెళ్లి.. ఆ గుడి  ఎక్కడుందంటే...

చాలామందికి పెళ్లి వయస్సు వచ్చినా పెళ్లి కావడం లేదని బాధ పడుతుంటారు.  పండితులకు.. సిద్దాంతులకు.. జాతకాలు చెప్పే వారి దగ్గరకు పరిగెడుతుంటారు.. ఆ పూజలు చేయాలి.. ఈ పూజలు చేయాలి అని చెబుతుంటారు.  కాని భారత దేశంలోని ఓ దేవాలయానికి వెళితే ఏడాది తిరిగేలోపు ఓ ఇంటివారవుతారట.. ఇంతకూ ఆ దేవాలయం ఎక్కడ ఉంది.  దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. . . .

 పెళ్లి వయసు దాటిపోతున్నా ఇంకా పెళ్లికాలేదా.. ఎన్ని సంబంధాలు చూసినా ఫిక్సవడం లేదా? అయితే ఈ ఆలయానికి వెళ్లొస్తే ఏడాది తిరిగేలోగా ఓ ఇంటివారైపోతారట. జడలు కట్టిన కేశాలతో, తోలుదుస్తులతో, కాలసర్పాన్ని కంఠాభరణంగా వేసుకుని పరమేశ్వరుడు ...  ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమైన అమ్మవారు కళ్యాణ సుందర ఆలయంలో కొలువై ఉంది  జనాల కోరికలు తీరుస్తున్నారట. శంకరుడు వాక్కు అయితే పార్వతి వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ . ఇంతకన్నా ఒద్దికైన ఆలుమగలు ఎక్కడుంటారు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆదిదంపతులుగా చెబుతారు..అలాంటి ఆదిదంపతులకు కళ్యాణం జరిగిన ప్రదేశమే కళ్యాణ సుందర్ ఆలయం. 

తమిళనాడులో ఉన్న ఆలయం

తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుట్టాలమ్‌ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది కళ్యాణసుందర్‌ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో ఉన్న ఈ  ఈ ఆలయంలోని పార్వతీపరమేశ్వరులు పాణిగ్రహణ  విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశంలో శివ పార్వతులైన ఆ  ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులు భావిస్తారు. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్లొస్తే చాలు ఏడాది తిరిగేలోగా వివాహం జరిగిపోతుందని విశ్వాసం.

చోళులు నిర్మించిన ఆలయం

ఈ  ఆలయాన్ని తొమ్మిదో శతాబ్ధంలో చోళరాజులు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.   ఆ తర్వాత 1336-–1485 మధ్య సంగమ రాజవంశం ..., 1491-–1570 మధ్య తులువా రాజవంశం విస్తరణ పనులు చేపట్టింది. ఈ  ఆలయ అభివృద్ధిలో విజయగర పాలకుల పాత్ర కూడా ఉంది.  ఈ ఆలయంలో ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రత్యేక పూజలు, సేవలు ఉంటాయి. కేవలం వైష్ణవ ఆలయాల్లో మాత్రమే ఇలాంటి సేవలుంటాయి. ఇక్కడ శివాలయంలోనూ ఉదయం నుంచి రాత్రి వరకూ వరుస సేవలు కొనసాగుతాయి.

లింగరూపంలో రాహువు

నవ గ్రహదేవతల్లో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూపంలో ఉండటం వలన జాతకంలో ఉన్న రాహుదోషం తొలగిపోయేందుకు రాహు శాంతి పూజలు కూడా చేయిస్తారు.