కల్వల ప్రాజెక్టుకు గండి.. వృధాగా పోతున్న నీరు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లోని కల్వల ప్రాజెక్టుకు గండిపడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద పెరగడంతో మంగళవారం జూలై 23, 2024న కల్వల ప్రాజెక్టుకు గండిపడి నీరు వృధాగా పోతుంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టుకు గండిపడింది. అయితే గండిని పూర్తిగా పూడ్చకుండా..ఇసుక బస్తాలతో తాత్కాలికంగా పూడ్చివేశారు. ఈ సారి కూడా వర్షాలు ఎక్కువగా పడటంతో వరద పెరిగి మరోసారి కల్వల ప్రాజెక్టుకు గండిపడింది. కల్వల ప్రాజెక్టు గండిని పూడ్చకుండా ప్రజాప్రనతినిధులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గండి పూడ్చి నీటి వృధాను ఆపాలను కోరారు.