ఈ కోడి రూటే సపరేటు: ఓనర్​ చెప్పినట్టు వింటున్న కడక్​నాథ్ ​కోడి

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మల్లారెడ్డి. జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇతడికి ఓ కోళ్లఫారం ఉంది. అందులో సుమారు 200 కడక్​నాథ్​కోళ్లను పెంచుతున్నాడు. అయితే, ఇందులో ఒక కోడికి తానంటే ఎంతో ప్రేమ అని, అది చెప్పినట్టు వింటోందని మల్లారెడ్డి చెప్తున్నాడు. 

తాను ముందుకు వెళ్లమంటే వెళ్తుందని, వెనక్కి రమ్మంటే వస్తుందని అంటున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి తన భుజాలపై ఎక్కి కూర్చుంటుందని సంబురపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.