రూ.10 కట్టి సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేయండి...ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ.పాల్‌‌‌‌‌‌‌‌

ఖమ్మం టౌన్, వెలుగు : టెన్త్‌‌‌‌‌‌‌‌ విద్యార్హత కలిగి ఉండి, రూ. 10 కట్టి సభ్యత్వం పొందిన ఎవరైనా రానున్న గ్రామ పంచాయతీఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేయొచ్చని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ.పాల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేని భట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఖమ్మం నగరంలోని బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డులో ఉన్న కృష్ణ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు హాజరైన ఆయన ముందుగా మీడియాతో మాట్లాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఖమ్మం నగరంలోని మున్నేరు రిటైనింగ్‌‌‌‌‌‌‌‌వాల్‌‌‌‌‌‌‌‌, సీతారామ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. వరద ముంపునకు గురైన ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి, ఏడాది గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తమ సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు గెలిచిన ప్రతి గ్రామంలో 100 రోజుల్లోనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పారు.